ఆహా ఏమి రుచి…

Posted in సమీక్ష on మే 21, 2008 by రాజేష్
ఈరోజు బాక్స్ పట్టుకు రాలేదు. subway కానీ, sandwich కానీ లంచ్ కి తిందాము అనుకున్నా. పన్నెండో గంట కొట్టగానే, బయటకి వచ్చా. చిన్న చినుకుతో వర్షం పడుతోంది. రోజూ ముందుగా కనపడే తోపుడు బండివాడు కనపడ్డాడు. ఆ బండి ముందు కనీసం పదిహేను మంది అనుకుంటా ఉన్నారు. రోజూ అంతే. చాలా busy గా ఉంటుంది వాడి బండి దగ్గర. నాకు ఈరోజే తెలిసింది వాడు శాఖాహారం కూడా అమ్ముతాడని. సరే ఎలా ఉంటుందో చూద్దాం అని, వెళ్ళి లైన్ లో నుంచున్నా. పావుగంటలో నా వరకూ వచ్చింది. Menu లో మొత్తం మీద మూడో నాలుగు రకాలు ఉన్నాయి. చికెన్ రైస్, చికెన్ sandwich, దాల్ (పప్పు) రైస్ లు main items. నేను దాల్ రైస్ అని చెప్పాను. Salad కావాలా అని అడిగాడు. OK అన్నాను. అప్పుడు చూసాను. వాడి బండి చిన్నదే అయినా, నాలుగు గిన్నెలలో ఉడికిన అన్నం ఉంది. ఒక పెనం మీద చికెన్ వేడెక్కుతోంది. ఒక డబ్బాలో తరిగిన cabbage, carrot, tomato ముక్కలు ఉన్నాయి. వాడికి
ఇంకొక మనిషి orders ని pack చెయ్యడానికి సహాయం చేస్తున్నాడు. దాల్ రైస్ ఒక డబ్బాలో వేసి, పక్కనే పాలకూరతో చేసిన కూరా, salad వేసి ఇచ్చాడు. మొత్తం 5$. ఆఫీస్ కి తెచ్చుకుని తిన్నాను. చాలా రుచిగా ఉంది. న్యూయార్క్ లో, Roadside బండిలో, ఇంత మంచి శాఖాహార భోజనం దొరుకుతుందని ఎన్నడూ అనుకోలేదు. మామూలుగా అంత పట్టించుకో పోయినా, “street vendors in New York” అని Google లో వెతికాను. Manhattan లో
ఎక్కడో ఒక తమిళుడు, చాలా మంచి దోశలు వేస్తాడుట. అతని పేరు తిరు ’దోశ’ కుమార్. [2007 vendy awards] వాడి దగ్గర చాలా మంది తింటూ ఉంటారుట. ఏటా జరిగే పాటీలలో వాడికి మొదటి బహుమతి కూడా వచ్చిందిటా. ఈసారి ఆ చుట్టు పక్కల ఉంటే వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాను.

చాన్నాళ్ళకి మళ్ళీ…

Posted in అవీ ఇవీ on మే 19, 2008 by రాజేష్
ఒక నగరం నుంచి మరో మహానగరానికి….
రోజూ రెండు నిమిషముల నడక నుంచి గంటన్నర రైలు ప్రయాణానికి….
మధ్యాన్న భోజనం, కంచం నుంచి లంచ్ డబ్బాకి….

ఈ మార్పులన్నీ వచ్చాయి న్యూయార్క్ కి సంసారాన్ని మార్చాక. కానీ ఈ మార్పు వల్ల రైలులో దొరికే నలభై నిమిషాలని పుస్తక పఠనానికి ఉపయోగించాలని ముందే నిర్ణయించుకున్నందున, కాలక్షేపం బాగానే అవుతోంది. ఒక english పుస్తకము, మూడు తెలుగువి చదివాను. అందులో చెప్పుకో దగ్గవి, ఒకటి శ్రీరమణగారు రాసిన కధలు, రెండు మొక్కపాటి నరసింహశస్త్రి గారి బారిష్టరు పార్వతీశం. ప్రస్తుతానికి చదువు తున్నది, అమెరికా తెలుగు కధానిక అనే తెలుగు కధల సంగ్రహము. ఇందులో సంపాదకులు డా!! పెమ్మరాజు వేణుగోపాల రావు గారు రాసిన కధానిక తత్వ విచారణ, చాలా వివరంగా ఉంది. ఇందులో
కధలకీ నవలలకీ తేడాలు, కధా నిర్మాణం, కధాదృక్పధం గురించి చక్కగా వివరించారు.

గూగుల్ చేయలేనిది… యాహూ చేయగలిగినది…

Posted in సాంకేతికం on నవంబరు 1, 2007 by రాజేష్

నావరకు యాహూ కన్నా నేను గూగుల్ కే ప్రాముఖ్యం ఇస్తాను. కారణం ఒక్క ముక్కలో చేప్పాలి అంటే “simplicity”. కానీ ఈరోజు ఒక వ్యాసం చదివాక కొన్ని కొత్త విషయాలు గూగుల్ చేయలేనివి… యాహూ చేయగలిగినవి… తెలిసాయి.

1. “Yahoo Search Bar” లో “!mail someone@something.com” అని “Search” చేస్తే వెంటనే మీ యాహూ email లో “Compose” కి వెడుతుంది. అక్కడ “To:” లో someone@something.com చేర్చబడుతుంది.

నేను ప్రయత్నిస్తే “Yahoo” లో ముందుగా “Login” అయితేనే ఇది పని చేస్తుంది.

2. “Yahoo Search Bar” లో “madonna lyrics” అని “Search” చేస్తే “madonna” పాటల lyrics కనపడతాయి.

౩. “Yahoo Search Bar” లో “[Yogi Vemana]” అని “Search” చేస్తే “Yogi” పదము తరువాత “Vemana” పదము వచ్చే పేజీలు మాత్రమే కనపడుతాయి.

4. “Yahoo Search Bar” లో “!ebay Nikon” అని “Search” చేస్తే “ebay” లో అమ్మే “Nikon” వస్తువులు కనపడుతాయి.

5. “Wikipedia” లో ఎన్ని పేజీలు “koodali.org” కి link చేస్తున్నాయో తెలుసుకోవడం ఇలా -

“Yahoo Search Bar” లో “linkdomain:koodali.org site:wikipedia.org” అని “Search” చెయ్యాలి.

పూర్తి వివరాలకు http://www.labnol.org/internet/search/better-yahoo-search-features-not-in-google/1690/ ని సందర్శించడి.

ద్రావిడు గతి ఇంతే

Posted in క్రికెట్ on అక్టోబర్ 28, 2007 by రాజేష్

ద్రావిడు గతి ఇంతే

ఇక ఆడలేడంతే

ఆట రాని సెహవాగ్ నీ మనము చూడాలంతే  (మనిషి బ్రతుకింతే బాణీ లో……)

దారుణం. ద్రావిడ్ ఎంతటి ఆటగాడో రుజువు చేసుకోవసనిన పనిలేదు. సెహవాగ్ కే ఆ అవసరం ఉంది. నిన్న జరిగిన ఛాలెంజర్ ట్రోఫీ మ్యాచ్ లో తప్పించి సెహవాగ్ గారు పీకింది ఏమీ లేదు. ఈ విషయం తెలిసి కూడా management ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సబబు కాదు. ద్రావిడ్ కి ఇంకో ౩ ఏళ్ళు ఆడే సత్తువ ఉంది.తొందరగా team లోకి మళ్ళీ రావాలని ఆశిస్తూ…..

Office పిచ్చాపాటి

Posted in అవీ ఇవీ on అక్టోబర్ 26, 2007 by రాజేష్

Blog మొదలు పెట్టేసాను కాని, ఏమి రాయాలో, ఎలా మొదలు పెట్టాలో అర్ధం అవ్వక కొట్టుకుపోతున్నాను. office లో పనేమి లేదు కాబట్టి, దీని గురించే అలోచనలో పడ్డా.

Office లో పొద్దున్న ఒకసారి, సాయంకాలం ఒకసారి, కాఫీ/టీ తాగడం అలవాటు. ఆ time లో పిచ్చాపాటి ఎలాగూ ఉంటుంది. మొన్న మొన్నటి వరకూ cricket మీద కబుర్లు. T20 అని, IND vs AUS అని మాట్లాడు కోవడానికి బోలెడన్ని విషయాలు. మా group లో నలుగురు తెలుగువాళ్ళు, ఒకరు కన్నడిగుడు, ఇద్దరు మరాఠీలు. Cricket అనగానే, భాషాభేధం లేకుండా, ఎంతసేపైనా మాట్లాడేసుకుంటాం. ఈ వారంలో cricket లేకపోయినా, శ్రీజ-శిరీష్ ల పెళ్ళి విషయం ప్రధమాంశం అయ్యింది. పోనీ మా తెలుగు వాళ్ళ మధ్యలో అంటే అర్ధం చేసుకోవచ్చు కానీ Internet మూలమానీ మారాఠీవాడు కూడా ఈ విషయం గురించి అడిగితే నవ్వోచ్చింది.

ఈ వార్తని అతిగా ప్రసారం చేసారు అనలేం. మనకి ఇలాంటి వార్తల మీద interest ఉన్నంత వరకూ వాళ్ళు ఇలాంటి topics ని highlight చేస్తారు. ఇక్కడ అమెరికాలోనూ అంతే కదా. పొద్దున్న వచ్చే Talk shows లో “News Break” అని ప్రకటనలకి బదులు, నిజమైన వార్తలు ౩౦ seconds లో చదువుతారు. మిగతా సమయంలో వచ్చేదంతా పరమ సోధి. అదేదో ఊర్లో ఉన్న కుక్క పాటలు పాడుతుందని, వాడెవడో పెళ్ళి ప్రతిపాదనని, తలకిందులుగా చేసాడని, ఇలాంటి వార్తలు వేస్తూ ఉంటారు.

పోను పోనూ ఎలాగూ Internet లో చదువుతారు కదా, మళ్ళీ అవే ఎందుకు అని TV లో వార్తలని పూర్తిగా మానేస్తారేమో.

పరిచయము

Posted in అవీ ఇవీ on అక్టోబర్ 25, 2007 by రాజేష్

ఊరు: అమెరికాలో ఫలానా రాష్ట్రంలో ఫలానా ఊరు

ఉద్యోగం: అమెరికాలో సగం తెలుగువారు చేసేదే – సాఫ్టువేరు ఇంజనీరు.

ఇష్టాలు:
పెళ్ళికి ముందు – WWF, Cricket, Formula One Racing, వంటలు వండటం, తినడం.

పెళ్ళి అయ్యాక - WWF, Cricket, వండినవాటికి వంకలు పెట్టడం.

పిల్లాడు పుట్టాక – Cricket, Tennis, వండినవి తినడం, మా వాడి అల్లరిని చూస్తూ ఆనందించడం.

Blog రాయాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. koodali.org మరియు thenegoodu.org లో ఉన్న Blogs ని చూసి, ప్రేరణ పొంది, ఇలా మొదలు పెట్టాను. చూద్దాం దీనికి ఎంత వరకూ న్యాయం చేస్తానో.