Office పిచ్చాపాటి
Blog మొదలు పెట్టేసాను కాని, ఏమి రాయాలో, ఎలా మొదలు పెట్టాలో అర్ధం అవ్వక కొట్టుకుపోతున్నాను. office లో పనేమి లేదు కాబట్టి, దీని గురించే అలోచనలో పడ్డా.
Office లో పొద్దున్న ఒకసారి, సాయంకాలం ఒకసారి, కాఫీ/టీ తాగడం అలవాటు. ఆ time లో పిచ్చాపాటి ఎలాగూ ఉంటుంది. మొన్న మొన్నటి వరకూ cricket మీద కబుర్లు. T20 అని, IND vs AUS అని మాట్లాడు కోవడానికి బోలెడన్ని విషయాలు. మా group లో నలుగురు తెలుగువాళ్ళు, ఒకరు కన్నడిగుడు, ఇద్దరు మరాఠీలు. Cricket అనగానే, భాషాభేధం లేకుండా, ఎంతసేపైనా మాట్లాడేసుకుంటాం. ఈ వారంలో cricket లేకపోయినా, శ్రీజ-శిరీష్ ల పెళ్ళి విషయం ప్రధమాంశం అయ్యింది. పోనీ మా తెలుగు వాళ్ళ మధ్యలో అంటే అర్ధం చేసుకోవచ్చు కానీ Internet మూలమానీ మారాఠీవాడు కూడా ఈ విషయం గురించి అడిగితే నవ్వోచ్చింది.
ఈ వార్తని అతిగా ప్రసారం చేసారు అనలేం. మనకి ఇలాంటి వార్తల మీద interest ఉన్నంత వరకూ వాళ్ళు ఇలాంటి topics ని highlight చేస్తారు. ఇక్కడ అమెరికాలోనూ అంతే కదా. పొద్దున్న వచ్చే Talk shows లో “News Break” అని ప్రకటనలకి బదులు, నిజమైన వార్తలు ౩౦ seconds లో చదువుతారు. మిగతా సమయంలో వచ్చేదంతా పరమ సోధి. అదేదో ఊర్లో ఉన్న కుక్క పాటలు పాడుతుందని, వాడెవడో పెళ్ళి ప్రతిపాదనని, తలకిందులుగా చేసాడని, ఇలాంటి వార్తలు వేస్తూ ఉంటారు.
పోను పోనూ ఎలాగూ Internet లో చదువుతారు కదా, మళ్ళీ అవే ఎందుకు అని TV లో వార్తలని పూర్తిగా మానేస్తారేమో.