ఆహా ఏమి రుచి…
ఈరోజు బాక్స్ పట్టుకు రాలేదు. subway కానీ, sandwich కానీ లంచ్ కి తిందాము అనుకున్నా. పన్నెండో గంట కొట్టగానే, బయటకి వచ్చా. చిన్న చినుకుతో వర్షం పడుతోంది. రోజూ ముందుగా కనపడే తోపుడు బండివాడు కనపడ్డాడు. ఆ బండి ముందు కనీసం పదిహేను మంది అనుకుంటా ఉన్నారు. రోజూ అంతే. చాలా busy గా ఉంటుంది వాడి బండి దగ్గర. నాకు ఈరోజే తెలిసింది వాడు శాఖాహారం కూడా అమ్ముతాడని. సరే ఎలా ఉంటుందో చూద్దాం అని, వెళ్ళి లైన్ లో నుంచున్నా. పావుగంటలో నా వరకూ వచ్చింది. Menu లో మొత్తం మీద మూడో నాలుగు రకాలు ఉన్నాయి. చికెన్ రైస్, చికెన్ sandwich, దాల్ (పప్పు) రైస్ లు main items. నేను దాల్ రైస్ అని చెప్పాను. Salad కావాలా అని అడిగాడు. OK అన్నాను. అప్పుడు చూసాను. వాడి బండి చిన్నదే అయినా, నాలుగు గిన్నెలలో ఉడికిన అన్నం ఉంది. ఒక పెనం మీద చికెన్ వేడెక్కుతోంది. ఒక డబ్బాలో తరిగిన cabbage, carrot, tomato ముక్కలు ఉన్నాయి. వాడికి
ఇంకొక మనిషి orders ని pack చెయ్యడానికి సహాయం చేస్తున్నాడు. దాల్ రైస్ ఒక డబ్బాలో వేసి, పక్కనే పాలకూరతో చేసిన కూరా, salad వేసి ఇచ్చాడు. మొత్తం 5$. ఆఫీస్ కి తెచ్చుకుని తిన్నాను. చాలా రుచిగా ఉంది. న్యూయార్క్ లో, Roadside బండిలో, ఇంత మంచి శాఖాహార భోజనం దొరుకుతుందని ఎన్నడూ అనుకోలేదు. మామూలుగా అంత పట్టించుకో పోయినా, “street vendors in New York” అని Google లో వెతికాను. Manhattan లో
ఎక్కడో ఒక తమిళుడు, చాలా మంచి దోశలు వేస్తాడుట. అతని పేరు తిరు ’దోశ’ కుమార్. [2007 vendy awards] వాడి దగ్గర చాలా మంది తింటూ ఉంటారుట. ఏటా జరిగే పాటీలలో వాడికి మొదటి బహుమతి కూడా వచ్చిందిటా. ఈసారి ఆ చుట్టు పక్కల ఉంటే వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాను.

మే 21, 2008 వద్ద 4:47 అపరాహ్నం
బావుంది మీలంచ్ ఘట్టమ్
మే 21, 2008 వద్ద 5:43 అపరాహ్నం
చాలా బాగు౦ది. ఇలా౦టి సైట్ ఒకటి ఉ౦టు౦దని ఊహి౦చలెదు. మామూలూ విషయాన్ని కల్లము౦దర జరుగుతున్నట్లుగా రాసారు. good luck to u .
మే 21, 2008 వద్ద 11:31 అపరాహ్నం
cool.
I miss the food trucks of Philadelphia.
మే 22, 2008 వద్ద 5:33 అపరాహ్నం
@కొత్తపాళీ – రోడ్ సైడ్ ట్రక్స్ లో నేను ఇంత వరకూ తినలేదు. మొదటి ప్రయత్నమే బాగా కుదిరింది.
@రాజేంద్ర & @varma – Thank you
మే 22, 2008 వద్ద 8:38 అపరాహ్నం
ఫలఫెల్ (ఫలాఫె అని అంటారు) ట్రై చెయ్యండి ఈ సారి. జ్యూయిష్ వాళ్ళ ఫుడ్. రొట్టెలో దాల్ వగైరా పెట్టి ఇస్తాడు, బండ్లమీదే అమ్ముతారు న్యూయార్కులో. సూపర్బ్.